పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం లో 5 గురు ఆత్మహత్య

పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌కు(Committed suicide) పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. దైవదర్శనానికి వచ్చిన కుటుంబ స‌భ్యులు వ‌డ్డెర స‌త్రంలో ఇద్ద‌రు పురుషులు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోగా స్నానాల గ‌దిలో మ‌రో ముగ్గురు మ‌హిళ‌లు విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.మృతులుమల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, సుధాకర్, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవనర్మణం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామ‌ని ఆత్మ‌కూరు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. వీరంతా ఏపీలోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తులపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *