మహబూబాబాద్ జిల్లాలో విషాదం
అక్కడికక్కడే మృతి
Thovva web news .August 24: 12pm

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.మృతురాలిని కురవి మండలం సూర్య తండాకు చెందిన అజ్మీరా మంగుతాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది