ప్రభుత్వ రంగాన్ని కాపాడదాం…

 దేశాన్ని రక్షిద్దాం!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బిఎస్ఎన్ఎల్.. బలోపేతం చేద్దాం! 

ఢిల్లీ ఛలో పార్లమెంట్” కార్యక్రమం లో నేతలు 

తొవ్వ,

దేశ టెలికాం రంగాన్ని ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించిన బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయాల్సిన సమయంలో, కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ, కార్పొరేట్ గుత్తాధిపత్యానికి మార్గం సుగమం చేస్తున్నాయనీకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తెలిపారు శుక్రవారం దేశవ్యాప్తంగా , పెన్షనర్లు, కాంట్రాక్ట్ కార్మికులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, దేశ టెలికాం స్వావలంబన, ప్రజలకు చౌకైన సేవలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దామనే పిలుపుతో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.వారు న్యాయగా ప్రధాన డిమాండ్లును తెలియజేశారు : 4G, 5G విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టి బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయాలి. వినియోగదారులకు నాణ్యమైన సేవలను కల్పించాలి.

ఉద్యోగాల భర్తీ: ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.3వ PRC అమలు: ఉద్యోగులకు 3వ వేతన సవరణ (PRC)ను వెంటనే అమలు చేయాలి.పెన్షన్ సవరణ: పెన్షనర్లకు పెన్షన్ సవరణను ఆలస్యం చేయకుండా అమలు చేయాలి. అఫోర్డబిలిటీ క్లాజ్ రద్దు: అఫోర్డబిలిటీ క్లాజ్ను పూర్తిగా రద్దు చేయాలి.కాంట్రాక్టీకరణ నియంత్రణ కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ విధానాలను నియంత్రించాలి.

ఈ పోరాటం ఎందుకు ?

ఈ పోరాటం కేవలం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసమే కాదు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దేశ వ్యూహాత్మక టెలికాం ఆస్తి అయిన బిఎస్ఎన్ఎల్ను పరిరక్షించి, మరింత బలోపేతం చేయడం కోసమే మా పోరాటం. ప్రతి గ్రామానికి, ప్రతి సరిహద్దు ప్రాంతానికి, ప్రతి పౌరుడికి భరించగల ధరల్లో, నమ్మదగిన, సురక్షితమైన, నాణ్యమైన టెలికాం సేవలు అందాలంటే బలోపేతమైన బిఎస్ఎన్ఎల్ అనివార్యం.

బలమైన బిఎస్ఎన్ఎల్ ఉంటేనే టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతుంది, ప్రైవేట్ గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజలకు సరసమైన టారిఫ్ లు, మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయి. దేశ కమ్యూనికేషన్ భద్రత, డిజిటల్ సార్వభౌమత్వం కూడా పరిరక్షించబడతాయి.

అందుకే, బిఎస్ఎన్ఎల్ను కాపాడటం అంటే కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడటం కాదు; 140 కోట్ల భారత ప్రజల టెలికాం హక్కును, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను, ప్రజల భవిష్యత్తును కాపాడటం. ప్రభుత్వ రంగం బలహీనపడితే నష్టపోయేది ఉద్యోగులు మాత్రమే కాదు… దేశ ప్రజలు కూడా!

బలమైన బిఎస్ఎన్ఎల్ లేకపోతే, టెలికాం రంగంలో గుత్తాధిపత్యం పెరిగి, టారిఫ్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సేవలు దెబ్బతింటాయి. దేశ వ్యూహాత్మక కమ్యూనికేషన్ వ్యవస్థ

బలహీనపడుతుంది.అందుకే ఈ ఉద్యమం దేశ ప్రజల కోసం చేస్తున్న ఒక దేశభక్తి పోరాటం. కావున మా పోరాటానికి, ఆగస్టు 7న జరిగే “ఛలో పార్లమెంట్” ఉద్యమానికి కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, మేధావులు, ప్రజాస్వామ్య శక్తులు మరియు ప్రజలందరూ పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

మా పోరాటం

ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం… ప్రజల హక్కుల పరిరక్షణ కోసం… బలమైన బిఎస్ఎన్ఎల్ కోసం… దేశ ప్రయోజనాల కోసం…—

మన గొంతును పార్లమెంట్ వినేలా చేద్దాం!

“పోరాడితేనే హక్కులు – ఐక్య పోరాటమే విజయం!”అన్నారు ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *