
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి ఈ సోమవారం ఉదయం సుమారు 11 గంటలు అవుతున్నప్పటికీ పలు శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదని తెలుస్తోంది.
ముఖ్యంగా రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెడికల్ అండ్ హెల్త్, ఫారెస్ట్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వచ్చిన ప్రజలు అధికారుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సమయానికి హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు సుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
