ఘనంగా పిఎసిఎస్ డైరెక్టర్ కొయ్యేడి వెంకటేశ్వర్లు మాతృమూర్తి విజయ 21వ వర్ధంతి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఘనంగా నివాళులర్పించిన స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు 

తొవ్వ, (స్వాగతం) నెల్లికుదురు, సెప్టెంబర్ 21 

మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి గూడెం ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొయ్యేడి వెంకటేశ్వర్లు గౌడ్ మాతృమూర్తి కొయ్యేడి విజయ 21వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తూర్పాటి శంకరయ్య, ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న లతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు గౌడ్ మాతృమూర్తి ని స్మరిస్తూ ప్రతిఏటా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు వర్ధంతిని నిర్వహించడం ఆయనకు మాతృమూర్తి పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో పాటు గౌరవాన్నితెలుపుతున్నాయన్నారు. అంతేకాకుండా ఆమె గ్రామంలో ప్రజలందరికీ తలలో నాలుక లాగా ఉండేవారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధైర్యాన్ని కల్పించడంతోపాటు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు బదావత్ రామచంద్రు, వెలిశాల దేవేందర్ రావు, వార్డు సభ్యులు కొత్తూరు విజయకుమార్, కారోబార్ దూబర్ల సాయిలు యాదవ్, వివిధపార్టీల నేతలు డేగల కుమారస్వామి. శివలాల్ , దేశ గానిబలరాం గౌడ్ మునుగంటి కుమార్, బేతమల్ల చంద్రయ్య. సొంలా,గోడుగువెంకన్న ,పెడబోయిన వెంకన్న గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు కొయ్యేడి కేదారి గౌడ్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *