మానుకోట భూమాఫియాపై ‘ఆర్ఎల్డీ’ యుద్ధభేరి!

పై వాక్యము మెయిన్ పేజీ లీడ్ 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

క్రింది వాక్యాలు సబ్ లీడ్ తీసుకొని ఫొటోస్  కార్టూన్ జోడించి 

8k4k HDR లో THUMBANIL 

*​కలెక్టరేట్ సమీపంలోని ‘శౌటం కుంట’ మాయం*

*ఆందోళనకు TRLD పార్టీ సిద్ధం,*

*​రెవిన్యూ మాఫియాలో మాజీ ఆర్డీఓ భాస్కర్ రావు, నాటి తహసీల్దార్లు*

*BRS-కాంగ్రెస్ నేతల సిండికేట్ అక్రమాలపై ఏసీబీ (ACB) విచారణ జరపాలి*

*​బస్ స్టాండ్ కల్లు కాంపౌండ్, బంధం కుంట, 307 బంధం రోడ్డు భూముల్లో బినామీ వాటాలు*

*​జిల్లా కలెక్టర్‌కు సమగ్ర విజ్ఞాపన పత్రం అందజేసిన TRLD జిల్లా అధ్యక్షులు డి.వై. గిరి.*

​మహబూబాబాద్ : సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ ముందే ప్రభుత్వ భూములు, నీటి వనరులు, ప్రభుత్వ, దేవాదాయ భూములు మాయమవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ జిల్లా అధ్యక్షులు డి. వై. గిరి ఆందోళన వ్యక్తం చేశారు. 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ రెవిన్యూ మాఫియా వెనుక కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని, ఈ మాఫియా వెనుక ఉన్న రాజకీయ-రెవెన్యూ సిండికేట్‌పై తక్షణమే అవినీతి నిరోధక శాఖ (ACB), విజిలెన్స్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (రెవిన్యూ సిట్) చే విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (TRLD) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు డి.వై. గిరి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ​మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలసి “శౌటం కుంట” ఆక్రమణలతో పాటు పట్టణంలోని బహుళ భూకుంభకోణాలపై విచారణ జరిపించాలని కోరుతూ సమగ్ర విజ్ఞాపన పత్రం (Representation) సమర్పించిన అనంతరం, ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

*శౌటం కుంట మాయం అధికారుల లాలూచీ*

​మహబూబాబాద్ కలెక్టరేట్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అత్యంత సమీపంలో ఉన్న “శౌటం కుంట” నేడు క్షేత్రస్థాయిలో పూర్తిగా కనుమరుగై భూమాఫియా నోట్లో చిక్కుకుందని డి.వై. గిరి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ నక్షాలు, పాత రికార్డులు మరియు గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లలో ఈ కుంట ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, భూభకాసురులు దానిని మింగేస్తుంటే అప్పటి మరియు ఇప్పటి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అవినీతి లాలూచీని బహిర్గతం చేయాలన్నారు.

*విస్తరించిన ఆక్రమణలు వందల కోట్ల బినామీ వాటాలు*

​ఈ మాఫియా నెట్‌వర్క్ కేవలం శౌటం కుంటకే పరిమితం కాలేదని, పట్టణంలోని అత్యంత విలువైన ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించిందని ఆయన ఆధారాలతో వివరించారు:

​మహబూబాబాద్ బస్ స్టాండ్ వైపు ఉన్న కల్లు కాంపౌండ్ భూమి. ​కురవి రోడ్డులోని “బంధం కుంట” భూములు.

​సర్వే నంబర్ 307 బంధం రోడ్డు భూములు. ​పత్తిపాక సర్వే నంబర్లు 503, 504 మరియు 267, 263/3 లలోని పట్టా భూములు ఈ రెవిన్యూ మాఫియా ముఠాచే అన్యాక్రాంతం అయ్యాయి.

*పొలిటికల్ & రెవెన్యూ సిండికేట్ – మాజీ ఆర్డీఓ భాస్కర్ రావు పాత్ర*

​గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబాబాద్‌ ఆర్డీఓగా పనిచేసి, అనంతరం సీసీఎల్ఏ (CCLA) లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఆర్డీఓ భాస్కర్ రావు ఈ మొత్తం నెట్‌వర్క్‌కు సూత్రధారి అని డి.వై. గిరి ఆరోపించారు. ​నాటి తహసీల్దార్లు (ముత్తినేని రంజిత్ కుమార్, కె. విజయ్ కుమార్, నాగ భవాని తదితరులు), ఖమ్మంలోని ఒక రిటైర్డ్ తహసీల్దార్లతో కలిసి రికార్డులను ట్యాంపరింగ్ చేయించారని మండిపడ్డారు. ​ఈ అక్రమాల్లో గత బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా కీలక నేత, మరియు మహబూబాబాద్‌కు చెందిన ఒక మునిసిపల్ కౌన్సిలర్ గాడిపెల్లి నాగేశ్వర్ రావు, సివిల్ కాంట్రాక్టర్ తల్లాడ విజయ్, రాజోలుకు చెందిన మాజీ నక్సల్, రౌడీ షీటర్ ఓభిలిశెట్టి శ్రీనివాస్ రావు భాగస్వాములై బినామీ పేర్లతో వందల కోట్ల వాటాలు పొందుతున్నారని సంచలన ఆరోపణ చేశారు.

*​​ప్రత్యేక దర్యాప్తులో వీరి పేర్లు చేర్చాలి:TRLD ప్రధాన డిమాండ్లు*

 ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక రెవెన్యూ దర్యాప్తులో మాజీ ఆర్డీఓ భాస్కర్ రావు, నాటి తహసీల్దార్లు, మాఫియాకీ సంబందించిన ప్రతి ఒక్క పేరు మరియు రాజకీయ నాయకుల పేర్లను చేర్చాలి.

*​ఏసీబీ (ACB) విజిలెన్స్ విచారణ* :సీసీఎల్ఏ ఉద్యోగిగా భాస్కర్ రావు, ఆయన రెవిన్యూ ముఠా సాగించిన అక్రమ సంపాదన, స్థానిక రియల్ ఎస్టేట్ వెంచర్లలోని బినామీ వాటాలపై ఏసీబీ విచారణ జరిపించాలి.

*​ఆక్రమణల తొలగింపు & పునరుద్ధరణ*: శౌటం కుంట, బంధం కుంట మరియు కల్లు కాంపౌండ్ భూములలోని ఆక్రమణలను తక్షణమే బుల్డోజర్లతో తొలగించి నీటి వనరులను పునరుద్ధరించాలి.

*​క్రిమినల్ కేసులు:* రికార్డులు ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ/ప్రైవేట్ భూములను కాజేసిన బాధ్యులపై BNS మరియు పీసీ యాక్ట్ (PC Act) కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

*తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ​పోరాట హెచ్చరిక*

జిల్లా యంత్రాంగం మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (TRLD) ఆధ్వర్యంలో బాధితులు, ఇతర రాజకీయ వేత్తలు మరియు ప్రజా సంఘాలను సమీకరించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డి.వై. గిరి హెచ్చరించారు. న్యాయ పరంగా, చట్ట పరంగా ముందుకు వెళ్తే జిల్లా పాలన యంత్రాంగం మొత్తం స్థంభించే అవకాశం ఉన్నందున వీరిపై తక్షణమే జిల్లా కలెక్టర్ క్రిమినల్, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డి. వై. గిరి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *