
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి ప్లాన్
స్కూల్ వ్యాన్ డ్రైవర్తో ఎఫైర్
కాల్ డేటా తో బయట పడిన బండారం:
Thovva web news. July 19:
ఉత్తర్ ప్రదేశ్లోని మేరర్ జిల్లా హస్తినాపుర్లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని అడ్డు పెట్టుకుని, ఇన్సూరెన్స్ డబ్బులపై కన్నేసిన భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా పాముతో కాటు వేయించి హత్య చేసింది. మృతుడిని అతుల్ పన్వార్ (32)గా పోలీసులు గుర్తించారు. అతుల్ పన్వార్, దామిని (30) దంపతులు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకు న్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగేళ్లుగా వీరు హస్తినాపుర్లో ‘కృష్ణ కిడ్స్ ప్లే స్కూల్’ నడుపుతు న్నారు. ఈ క్రమంలో దామినికి అదే స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్ వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అతులు అడ్డు తొలగించుకుని, అతడి పేరు మీద ఉన్న రూ.20 లక్షల బీమా సొమ్మును కాజేసి, పెళ్లి చేసుకోవాలని ఈ జంట పథకం పన్నింది. గతంలో కూడా అతులు కారుతో ఢీకొట్టి చంపాలని తుషార్ ప్రయత్నించగా, అదృ ష్టవశాత్తు అతుల్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పాముతో కాటు వేయించి..పథకం ప్రకారం గురువారం రాత్రి అతుల్ తాగే పాలలో దామిని అధిక మోతాదులో నిద్రమాత్రలు కలిపింది. దీనివల్ల అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం తుషార్, పాములను ఆడించే ఇద్దరు వ్యక్తుల నుంచి విషపూరిత సర్పాన్ని కొనుగోలు చేసి తెచ్చాడు. ఆ పామును అతుల్ దుప్పటిలో వదిలి కాటు వేయించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అతులు ఆసుత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతుల్ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా, వేడి కారణంగా తాను మరో గదిలో పడుకున్నానని, ఉదయం వచ్చి చూసేసరికి మంచంపై పాము కనిపించిందని దామిని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ఆమె మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా, వ్యాన్ డ్రైవర్ తుషార్ తరచుగా మాట్లాడినట్లు గుర్తించారు. తుషార్ను అదుపులోకి తీసుకుని విచారిం చగా అసలు విషయం బయటపడింది. పాములు సాధార ణంగా మనుషులకు దూరంగా ఉంటాయని, కానీ మంచం
మీద దుప్పటి కిందకు దూరి కాటేయడం అసంభవమని పోలీసులు గుర్తించారు. నిందితుల అంగీకారంతో కుట్ర బయటపడింది. పోలీసుల దామిని, తుషార్ తో పాటు పాములను సరఫరా చేసిన ఇద్దరిని అరెస్టు చేశారు.

