అర్హత కలిగిన ఒక్క ఓటు  పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాధ్యత అధికారులదే,

సర్ ప్రక్రియలో గ్రామ నాయకులు పాల్గొనాలి,

నిజాయితీగా సక్రమంగా సర్ ప్రక్రియ జరగాలి,

మాజీ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్,

తొవ్వ న్యూస్ ప్రతినిధి కురవి జూలై 10,

సర్ ప్రక్రియలు అర్హత కలిగిన ఒక ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల దేనని మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు, శనివారం మండలంలోని అయ్యగారి పల్లి గ్రామంలో జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరు పిచ్చిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని గ్రామ నాయకులకు సూచించారు, బి ఎల్ వోలు వచ్చినప్పుడు మీరు కూడా ఉండి (గ్రామ నాయకులు) దగ్గర ఉండి ఓటరు ఫారాలు నింపి బిఎల్ఓ కి ఇవ్వాలని సూచించారు, సర్ ప్రక్రియను పరదర్శికంగా నిజాయితీగా నిబద్దత తో చేయాలని బిఎల్ఓ లకు సూచించారు, సర్ ప్రక్రియలో 2002 ఓటర్ల జాబితా నుంచి బంధువుల వివరాలు తీసుకునే నిబంధనను తొలగించి ఓటర్లకు సడలింపు కలిగే విధంగా చేయాలని అన్నారు, 2002 నిబంధనను పూర్తిగా తొలగించి సర్ ప్రక్రియను వేగవంతము చేయాలని అన్నారు. బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ ను కలిసి వారి యొక్క వివరాలు తెలుసుకునీ నమోదు చేయాలని అన్నారు. కొంతమంది బీఎల్ఓ లు ఓటరు దగ్గరికి వెళ్లకుండా ఫారాలు వారికి ఇచ్చి మీరే నింపండి అని చెప్తున్నారని అన్నారు, ఈ విధంగా చేయడం వల్ల నిరక్షరాస్యులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.సర్ ప్రక్రియ చివరి తేదీ దగ్గర పడుతుండడం అదేవిధంగా ఇప్పటివరకు కనీసం 20% నమోదు కాకపోవడం చూస్తుంటే సర్ ప్రక్రియ గడువు తేదీని మరో నెల పొడిగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సర్ ప్రక్రియలో కొత్తగా వివాహమైన మహిళలకు వారి తల్లిదండ్రుల వివరాలు అడుగుతున్నారని, ఆ విధంగా అడగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని  వారి తల్లిదండ్రులు వివిధ ప్రాంతాల్లో ఉండడం వలన కొత్తగా వివాహమైన మహిళలకు 2002 లిస్టు వివరాలు సేకరించడం ఇబ్బందిగా ఉందని అన్నారు,వారి అత్తమామల 2002 లిస్టు వివరాలు తీసుకొని నమోదు చేస్తే సర్ ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుందని అన్నారు.బి ఎల్  ఓ లకు  పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రతి ఓటరు ను కలిసే విధంగా ఆదేశాలు పై అధికారులు ఇవ్వాలని అన్నారు,  ఈ సమావేశంలో  జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్, రామచంద్రయ్యా, తోట లాలయ్య, ముండ్ల రమేష్,.  బాదావత్ రాజు నాయక్, మండల   నాయకులు నూతక్కి సాంబశివరావు, భోజు నాయక్, పెద్ది వెంకన్న, సంగెం భరత్, సర్పంచ్ లు భూక్య శోభన్, బాదావత్ వీరన్న, నాయకులు బీకోజి నాయక్, ఇరుగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *