డయల్ 100 తో ఓ సీనియర్ జర్నలిస్ట్ ..స్వీయ అనుభవం…!!!*
*కాల్ చేస్తే రిసివ్ చేసుకున్నారు…!!!*
కానీ… తర్వాత ఒక్కరైనా కనీసం స్పందించలేదు….
thovva web page /MAY 06,… WED 10:AM
వివరలోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురం గ్రామ పరిధిలోని సీనియర్ జర్నలిస్ట్ జిల్లా ఐ జే యు అధ్యక్షులు
సొంత ..జామాయిల్ తోటలో మంగళవారం రాత్రి విద్యుత్ తీగలు తెగిపడడంతో అగ్నిప్రమాదం సంభవించింది…పక్కన మొక్కజొన్న కళ్ళాలు ఉండడం.
., మంటలు చేనంతా వ్యాపించడంతో వెంటనే ప్రమాద నివారణకు డయల్ 100 గుర్తుకు వచ్చి తక్షణసహాయం అందుతుంది అనే ఆలోచనతో రాత్రి సుమారు 7.30 గంటల ప్రాంతంలో పోన్ చేసారు ఆపరేటర్ స్పందించి కాల్ రిసీవ్ చేసుకున్నారు. లొకేషన్, అడ్రస్ చెప్పాడం జరిగింది .
పోలీస్ వారు, అగ్నిమాపాక సిబ్బంది మీకు తక్షణమే పోన్ చేస్తారు. అందుబాటులో ఉండండి అని చెప్పారు…!! ఇక్కడితో సమాప్తం
నిన్న రాత్రి 7.40 ప్రాంతంలో నాకు మెసేజ్ వచ్చింది తప్పా..!! *ఇప్పుడు ఉదయం 9.30 గంటలు అవుతున్న.., నేను డయల్ 100 కు పోన్ చేసి దాదాపుగా 14గంటలు కావస్తున్న.., జరగాల్సిన నష్టం జరిగి వాటంతట అవే మంటలు ఆరిపోయినా…!! ఇంతవరకు ఏ.. ప్రభుత్వశాఖ నుంచి కనీసం ఓ..పోన్ కాల్ అయినా రాకపోవడం నాకు విస్మయాన్ని.., ఆశ్చర్యాన్ని.., ఆందోళనను కలిగించిందని
ఒక జర్నలిస్ట్ గా డయల్ 100 తో వేగవంతమైన స్పందన ఉంటుంది.., ఆపద వస్తే పోన్ చేయండి అంటూ చాలా సందర్భాల్లో వార్తలు రాసాను..,* కానీ నాకు ఎప్పుడూ అవసరం రాక నేను డయల్ చేయలేదు.., *నిన్న మొదటిసారి చేస్తే ఈ..స్పందన చూసి నేను కరెక్ట్ గా చెయలేదా…??? లేక వారి పనితీరు సరిగా లేదా అనే అనుమానం కలిగింది…???
నిజంగానే ఏదైనా పెద్ద ఆపద వస్తే కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా అనే భయం కూడా వేసింది…!!!*
ఎవరినో తప్పు పట్టడానికో..!! వ్యవస్థలను నిందించడానికో కాదు కాని…!!* వందలసార్లు డయల్ 100 ఉపయోగం గురించి వార్తలు రాసిన నాకు.., డయల్ 100 తో ఎదురైనా స్వీయ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే రాస్తున్నాను..*
నా..వరకే ఇలా జరిగితే…!! అలసత్వమో.., అని ఊరుకుందాం కానీ…!! నిజంగా పెను ప్రమాదం సంభవిస్తే ప్రమాదం ప్రాణాల మీదికి వస్తే ప్రాణాలు పోవాల్సిందే నా అనే అప నమ్మకం కలుగక మానదు
…,
*ప్రభుత్వయంత్రాంగం సహకరించకపోయినా...!! ప్రకృతి సహకరించింది..!! కాలే అంతవరకు కాలిపోయి మంటలు చల్లారిపోయాయి…!!*
ప్రమాదానికి కారణం అయిన తెగిపడిన విద్యుత్ తీగలు చేనులోనే పడి ఉన్నాయి…, విద్యుత్ శాఖ వారు వచ్చి కాస్త వాటిని తొలిగిస్తే అటువైపు వచ్చే పశువులకు.., మనుషులకు, పంట చేలకు ప్రమాదం జరగకుండా ఉంటుంది…!!!*
డయల్ 100 ఎందుకో కనీస సహాయం కూడా అందించలేకపోయింది…!!
కనీసం విద్యుత్ శాఖ అధికారులైనా చర్యలు తీసుకుంటారో..!! లేదో వేచిచూడాల్సిందే…*
సిహెచ్ శ్రీనివాస్…*
జర్నలిస్ట్
