చీకట్లో చప్పుడు చేసి దక్కునే ముఠాకూ భయపడను….
పుకార్లతో నన్ను పార్టీ నుంచి బయటకి పంపలేరు…
ఇది నా కౌంట్ డౌన్ కాదు నా ,స్వరానికి పోరాటానికి బలం…
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ చీకట్లో చప్పుడు చేస్తున్న వాళ్లకు ఒక్కటే సమాధానం…
నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసం జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను.ఆ ప్రేమ ఉన్నంత వరకు… నన్నెవరూ ఆపలేరు.నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలుకాలేదు…నా స్వరం, నా నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే నా ధైర్యం… జగన్ అన్న నమ్మకం—ఇవే నా బలం.అంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు ఆమె సోమవారం. మీడియాకి ఇచ్చిన ప్రకటన లో భాగంగా ఇటీవల కాలంలో తనపై లేని పోనీ పుకార్లుసృష్టిస్తున్నారని తాడేపల్లిలో “పొగ” కనిపిస్తోందని కథలు రాసేవాళ్లు గుర్తుపెట్టుకోవాలి…పొగ ఎక్కువగా రావడం అంటే… కొందరిలో కడుపుమంట ఎక్కువైందన్న మాటే!నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే
అది పుకార్లతో కాదు… కుట్రలతో కాదు… ఎవరి వల్లా కాదని హెచ్చరించారు.రోజూ నా మీద కథలు రాసేవాళ్లు ఉంటారు…కానీ నేను ప్రతి రోజూ @ysjagan కలలు కన్న A.P దిశగా అడుగులు వేస్తున్నాను..!అన్నారు
నన్ను సైలెంట్ చేయాలనుకునే ప్రతి ప్రయత్నం… నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుందని
ఇది నా కౌంట్‌డౌన్ కాదు…
నా స్వరానికి… నా పోరాటానికి…
ఇంకా బలంగా మొదలయ్యే స్టార్ట్..!
నన్ను తగ్గించాలనుకునే వాళ్లు చాలామంది ఉంటారు…
కానీ నన్ను నిలబెట్టేది ఒక్క జగన్ అన్న నమ్మకం… కోట్లాది ప్రజల ప్రేమ! తో ముందుకి సాగుతనని అన్నారు.
