ముఖ్యమంత్రిగా దళపతి….

విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం-

 కాంగ్రెస్ అత్యవసర వర్చువల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

భాజపా తొ పొత్తుకి నో చెప్పిన తలపతి…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Thovva web మే 06

:తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలతో సత్తా చాటిన దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ను విజయ్‌ స్వయంగా కోరారు. దీంతో టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని కాంగ్రెస్స్ తమిళ శాఖ స్పష్టం చేసింది వర్గాలు .మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలు వర్చువల్ సమావేశంలో
ఈ నిర్ణయం తీసుకున్నారు  తమిళనాడు కాంగ్రెస్ పోలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)  సమావేశాన్ని తమిళనాడు వ్యవహారాల ఏఐసీసీ ఇన్​ఛార్జి గిరీశ్ చోదంకర్ ఏర్పాటు చేశారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్​సీసీ) అధ్యక్షుడు సెల్వపెరుంతగైతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు టీవీకేతో పోత్తు పెట్టువకోవడం వల్లే కలిగే వ్యూహాత్మక అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్
వచ్చిందని ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్​ మద్దతు కోరడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, గిరీశ్ చోడంకర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ వివరాలను కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కామరాజ్ పాలనను స్ఫూర్తిగా తీసుకున్న విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరారని తెలిపారు. తమిళనాడులో బీజేపీ, వారి ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని నడపకూడదన్నదే తమ నిర్ణయమని చెప్పారు. తమిళ ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు పీసీసీని ఆదేశించామని వివరించారు. తమిళనాడులో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకుండా చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వారం లోనే ప్రమాణ స్వీకారం 

విజయ్ ఈనెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా మంగళవారం ఎన్నికైన విజయ్‌, బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని ఇప్పటికే ఈ-మెయిల్‌ ద్వారా గవర్నర్‌ను కోరారు. ప్రస్తుతం టీవీకే ఎమ్యెల్యేలను విజయ్‌ మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 

విజయంపై ఎక్స్​లో పోస్ట్
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక, పరివర్తనాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. పార్టీ స్థాపించినప్పటి చాలామంది ఎగతాళి చేసినా, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా, కేవలం ప్రజలనే నమ్ముకుని స్థిరంగా నిలబడ్డానని విజయ్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను చాలా కాలంగా ప్రభావితం చేస్తున్న ధన బలాన్ని ఈసారి తమిళ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. టీవీకేకు ఓటు వేయని వారిని కూడా తాను గౌరవిస్తానని, తాము చేసే పనులతో వారంతా భవిష్యత్‌లో తమ పార్టీకి మద్దతిస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *