తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ ఎందుకంటే..!

జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, అలాంటి వ్యక్తి కృషిని గుర్తించేందుకు ఉపయోగించే తర్కబద్ధమైన భావన మాత్రమే. అందుకే, ఎవరో ఈ గుర్తింపునుఅంగీకరించలేదని ఆ వ్యక్తి చేసిన కృషి తగ్గిపోదు. ఈ కోణంలో చూస్తే, కే చంద్రశేఖర్‌రావును తెలంగాణ జాతిపిత అని పిలువడం భావోద్వేగంతో కూడిన నినాదం కాదు- ఒక చరిత్రాత్మక విశ్లేషణ.
పాలకుడు వేరు – స్థాపకుడు వేరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాజకీయ తత్వశాస్త్రం ఒక కీలక తేడాను స్పష్టంగా చెప్తుంది.పాలకులు (rulers) ఉన్న వ్యవస్థను నడిపిస్తారు.స్థాపకులు (founders) ఆ వ్యవస్థ ఉండేలా చేస్తారు.ఈ విషయం గురించి అరిస్టాటిల్‌ చాలా సూటిగా చెప్పారు.

The lawgiver should frame his laws with a view to the permanence of the constitution
-Aristotle (Politics)

అంటే, ఒక రాజకీయ వ్యవస్థ శాశ్వతంగా నిలబడేలా దారి చూపినవాడే స్థాపకుడు.
ఈ ప్రశ్నను తెలంగాణ విషయంలోఅడిగితే ఎవ్వరూ కాదనలేని సమాధానం.. కేసీఆర్‌.
కేసీఆర్‌ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమయ్యేదా?
రాష్ట్ర సాధన డిమాండ్‌తో 1969లో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి నిలకడగా ముందుకు సాగలేకపోయాయి.
తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా, ఒక నిరంతర పోరాటంగా, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లింది కేసీఆర్‌ నాయకత్వమే.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచింది ఆయన నాయకత్వం.
ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు-చరిత్రలో కనిపించే వాస్తవం.
స్థాపకులు ఎప్పుడూ అందరూ ఇష్టపడే వారు కానవసరం లేదు.
మహాత్మా గాంధీని భారత జాతిపితగా దేశం గుర్తిస్తున్నది. కానీ కొన్ని సిద్ధాంత ధారలు, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి వర్గాలు, ఈ గుర్తింపును చారిత్రకంగా అంగీకరించడంలేదు.
అయినా స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన కృషి, ఆయన పాత్ర ఏమాత్రం తగ్గలేదు.
ఇదే విషయాన్ని హన్నా అరెండ్‌ ఇలా వివరించారు.

Every beginning contains its own violence
-Hannah Arendt (On Revolution)

కొత్త రాజకీయ ఆరంభాలు పాత ఆలోచనలను కదిలిస్తాయి. అందుకే స్థాపకులపై వ్యతిరేకత సహజం.
ఈ కారణంగానే, మహాత్మా గాంధీని జాతిపితగా అంగీకరించని అదే సిద్ధాంత ధారల నుంచి వచ్చినవారు కొందరు నేడు కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా పిలువడాన్ని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
అది చరిత్రను తిరస్కరించడం కాదు- వారి సిద్ధాంతాన్ని కాపాడుకోవడమే.
తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఆలోచన నిర్మాణం.
జాన్‌ జాక్‌ రూసో ఇలా అన్నారు.

He who dares to found a people must be capable of changing human nature
-Jean-Jacques Rousseau (The Social Contract)

కేసీఆర్‌ చేసిన ముఖ్యమైన పని.. తెలంగాణ ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం.
తెలంగాణను కేవలం పరిపాలనా ప్రాంతంగా కాకుండా స్వీయ గౌరవం ఉన్న రాజకీయ సమాజంగా తీర్చిదిద్దారు.
తెలంగాణను కేవలం వెనుకబడిన ప్రాంతంగా కాకుండా, హక్కులు కలిగిన రాజకీయ సమాజంగా నిలబెట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాలు- ఇవి కేవలం డిమాండ్లు కాదు. ఇవి తెలంగాణ ప్రజల హక్కులుగా మారాయి. ఇది ఒక డిమాండ్ల జాబితా కాదు. ఇది ఒక రాజకీయ సిద్ధాంతం.
అధికారానికి మించిన సాంస్కృతిక నాయకత్వం.
ఆంటోనియో గ్రాంశీ ఇలా అన్నారు.

A social group becomes dominant when it exercises moral and intellectual leadership
-Antonio Gramsci, (Prison Note books)
కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, నీటిహక్కులు, ఉద్యోగ హక్కులు… రాజకీయ ప్రధాన అంశాలయ్యాయి.
ఇది కేవలం పాలన కాదు-ఒక గుర్తింపు నిర్మాణం.
తెలంగాణ-ఒక కొత్త రాజకీయ ఆరంభం.
హన్నా అరెండ్‌ చెప్పిన మాట ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *