గుజిలితండా పాఠశాల ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: వార్డు సభ్యులు

 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కురవి మండలం కొత్తూరు(సి) శివారు గుజిలితండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, నరేష్ లను గుజిలితండాలో ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జాటోత్ సుజాత శంకర్ , ఝాన్సీ శ్రీను లు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గుజిలితండా పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, నరేష్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, వారి సేవలను గుర్తించి సన్మానించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఉపాధ్యాయుల పట్ల గ్రామస్తులకు ఉన్న గౌరవాన్ని చాటిచెప్పింది.

    ఈ కార్యక్రమంలో కొత్తూరు(సి) గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మలిశెట్టి వేణు, సర్పంచ్ భర్త బాదావత్ సిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *