కాట్రపల్లిలో దసరా పండుగ సందర్భంగా గొర్రెపోతు బలి
మూగజీవుల బలిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ అభ్యంతరాలు.. అయినా పట్టించుకోని అధికారులా?
ప్రజాప్రతినిధుల మౌనం.. జంతు హింసపై చర్యలు తీసుకునేదెవరు?
తొవ్వ కేసముద్రం , అక్టోబర్ 2

:
దసరా పండుగ సందర్భంగా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గొర్రెపోతును బలి ఇచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక నాయకుడు పొడువైన కత్తి తొ పూనకం వచ్చిన వ్యక్తిలా నాలువైపులా తిరుగుతూ కాళ్ళు మెడకు పొడువైన తాడు కట్టి గుంజిపట్టి ఉంచిన గొర్రె పోతు గింజకుంటున్న వదలకుండా అందరూ చూస్తుండగా ఒక వేటు తొ తల తెగ్గొసి చిందులు వేయడం చారాచనీయంశంగా మారింది.పండుగల పేరుతో మూగజీవులను బలి ఇవ్వడంపై జంతు ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జంతు హింసను నిరోధించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మూగజీవుల బలికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నపటికీ ఎవరు పాటించడం లేదు.. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రకారం పండుగల వేల జంతు బలి చేయకుండా దాని స్థానంలో సొరకాయ. లేదా గుమ్మడి కాయను బలి ఇవ్వాలని.. ఆదేశాలు వున్నా పాలు చోట్ల ఉలంగాణ జరిగింది. దీనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంతు హింసరోధక చట్టాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
