ఓబీసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్

మహబూబాబాద్: పట్టణంలోని యాదవ సంఘం కమిటీ హాలులో శ్రీకృష్ణ సదర్ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ.. యాదవులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదర్ ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో యాదవ సంఘం పెద్దలు, నాయకులు, యువకులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
యాదవులు జనాభా పరంగా పెద్ద సామాజిక వర్గాల్లో ఒకరని పేర్కొంటూ, సమాజంలో యాదవులకు సముచిత న్యాయం, తగిన గుర్తింపు లభించేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. సామాజిక అభివృద్ధి, హక్కుల సాధన, సంఘం బలోపేతం కోసం ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ యాదవ సంఘం అధ్యక్షుడు నేతుల వెంకన్న యాదవ్ , 28వ వార్డు కౌన్సిలర్ బొల్ల రాజు యాదవ్, జీలుగుల దర్గయ్య , ఎడ్ల రమేష్, రేఖ నవీన్, దేవనబోయిన రవి, సంద లక్ష్మీనారాయణ, బెల్లి రాజు ,రాకేష్, బాతుల స్వర్ణలత, మంద రాజు, మేకల శ్రీను, మంద విజయ్, భూతం మహేష్, రాసాల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
