హాజరైన మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు
తొవ్వ,మహబూబాబాద్, సెప్టెంబర్ 21:

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ లోని /మల్లం బజార్లో నిర్వహించిన గణపతి నవరాత్రుల సందర్భంలో మల్లం బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ లు వార్డ్ కౌన్సిలర్ బోళ్ల రాజు, కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఖలీల్ ముఖ్య అతిదులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులకు మాజీ సింగిల్ విండో చైర్మన్ పులి లక్ష్మారెడ్డి, నాయకులు గాంతి ఉపేందర్ రెడ్డి ఇతర కమిటీ సభ్యులు సన్మానం చేశారు.
స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు అతిధులు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్లు అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.అన్నదాన కార్యక్రమం సందర్భంగా బజార్లో సందడి నెలకొంది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు కొప్పుల సంతోష్ రెడ్డి,మల్లం రాములు, అంజయ్య మోత్కూరి వెంకటేశ్వర్లు,వెంకటేశ్వర్లు, రాజేష్. మహిళా సభ్యులు పాల్గొన్నారు.

