తృటీలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.
చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్.. 14 మంది విద్యార్థులు!
డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ నడపడంతో అదుపుతప్పి చెరువులో బోల్తా.
స్థానికుల సహాయంతో విద్యార్థులను బయటకు తీసిన గ్రామస్తులు

తొవ్వ వెబ్ న్యూస్. అక్టోబర్ 31:
మహబూబాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కురవి మండలం తిర్లాపురం గ్రామంలో గీతాంజలి స్కూల్‌కు చెందిన వ్యాన్ చెరువులో పడిపోయింది. 14 మంది విద్యార్థులతో పాఠశాలకు బయలుదేరిన వ్యాన్ డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడంతో అదుపుతప్పి చెరువులో బోల్తాపడినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానిక గ్రామస్తులు చెరువులోకి దిగి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
