ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
యువత కు ఆదర్శప్రాయుడు తీన్మార్ మల్లన్న…
మానుకోట జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నిక ఇంచార్జ్ చిలువేరు సమ్మయ్య గౌడ్
Thovva web .19 may, sun;

తీన్మార్ మల్లన్ననూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టభద్రులకు పిలుపునిచ్చారు.ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు డానియల్ అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ జిల్లా పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇంచార్జ్ చిలువేరు సమ్మయ్య గౌడ్ లు పాల్గొని మాట్లాడుతు ఎలాంటి పదవులు లేనప్పుడే ప్రజాసంక్షేమం కోసం ప్రజల తరఫున మాట్లాడిన వ్యక్తి మల్లన్న అని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన వాటిని తట్టుకొని ప్రజల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తిని శాసనమండలికి పంపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా మానుకోట జిల్లా పట్టబద్రుల ఉప ఎన్నిక జిల్లా ఇంచార్జ్ చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజల పక్షాన ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ తరఫున నిరుద్యోగుల సమస్యలపై పోరాడే మనిషి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అని . గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన తట్టుకొని నిలబడి ప్రజల కొరకు ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి అని ఎంతోమంది పేద విద్యార్థులకు కొండంత అండగా ఉండి తన స్వంత డబ్బులతో ఉచిత కోచింగ్ సెంటర్స్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలబడ్డాడని ఎమ్మెల్సీ గా గెలిపించుకుంటే పట్టభద్రులకు ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుందన్నారు.అంతేగాక దేశం లేనే ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేని ఒక గొప్ప నిస్వార్ధ చారిత్రాత్మక నిర్ణయం తనకు ఉన్నటువంటి 2 కోట్ల ఆస్తిని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించి తన పదవి మీద తానే రైట్ రీ కాల్ ని పెట్టుకొని ఒక కొత్త రాజకీయ ఒరవడికి తెరలేపిన ఒక అవినీతి రహిత రాజకీయ ఉద్యమ కారుడు అయిన తీన్మార్ మల్లన్న ను ఎమ్మెల్సీగా గేలిపించుకుంటే చట్టసభల్లో అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వచ్చే భావితరాల రాజకీయాలకు బాట వేసే నాయకున్ని మనము గెలిపించుకున్నట్టు ఉంటుంది అని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు,రమేష్ గౌడ్, విద్యాసాగర్,వెంకన్న, సత్యనారాయణ, నాగిరెడ్డి, వరలక్ష్మి ,రామచందర్ పార్టీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

