వేసవిమండి పోనుందా..?

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మార్చి నుంచి మే మధ్యలో దేశంలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. మార్చిలో ఉత్తర, మధ్య భారతంలో వడగాడ్పుల పరిస్థితుల ఉండకపోవచ్చని చెప్పారు. ఎల్‌ నినో పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల మధ్య పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం వేసవి కాలం మెుత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత తటస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు

ఎల్‌ నినో- పసిఫిక్‌ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగవచ్చని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్‌ కాలేజ్‌ చేసిన ఓ అధ్యయనం ఇదివరకే హెచ్చరించింది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *