ఆర్యవైశ్య మండల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్
THOVVA WEB NEWS.// 14.FEB.WED

సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణపై దాడి జరగడం తీవ్ర మనోవేదనకు గురైనట్లు మండల ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు చౌడారపు శ్రీనివాస్, ఆరోపించారు ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుండగులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా మహిళలపై దాడులు జరగడం సబబు కాదని మార్కెట్లో లోటు పాటలు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయినఅరుణపై దాడి చేయడం సరైనది కాదని రైతుల రూపంలో కొందరు గిట్టని వారు ఆమెపై దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రస్థాయిలో మండి పడ్డారు ఆర్యవైశ్యులు అంటేనే సేవకు మారుపేరని ఇటీవల కాలంలోనే కొంచెం కొంచెం పదవులు చేపడుతున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు జరగడం విస్మయానికి గురి చేసిందని పోలీసు అధికారులు వెంటనే స్పందించి దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యులు అంటే ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని గతంలో కంచె ఐలయ్య తన గ్రంథంలో ఆర్యవైశ్యులపై వివాదాస్పద మాటలు మాట్లాడితే ఎలాంటి పోరాటాలు చేసామో అందరికీ తెలిసినదే అని మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని లేకపోతే అన్ని జిల్లాల మండల కేంద్రంలో ఆర్యవైశ్యులు అందరూ రోడ్డుమీద బైఠాయించి ర్యాలీలు ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం సోమయ్య, జిల్లా నాయకులు బొల్లం మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మా శెట్టి ఉపేందర్, కోశాధికారి బి, సోమేశ్వరరావు,
మండల ఉపాధ్యక్షులు ఇమ్మడి నాగేశ్వరరావు, నాళ్ల ఉపేందర్,
జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చౌడారపు విక్రమ్, సిహెచ్ సంతోష్, గ్రామ అధ్యక్షులు మా శెట్టి వెంకన్న, మండల నాయకులు, కే వేణు, ఎం వేణు, వంగపల్లి సీతారాములు, నారాయణ, ఇమ్మడి నరేష్, శంకర్రావు, మాజీ దేవస్థానం చైర్మన్ బొల్లం రమేష్, మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, దేవయ్య, ఉల్లి శ్రీనివాస్, తోపాటు తదితరులు పాల్గొన్నారు