ముఖ్యమంత్రి ,ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం…..
శ్రీశ్రీశ్రీ సంతు సద్గురు సేవాలాల్ నూతన ఉత్సవ కమిటీ ఎంపిక
అధ్యక్షులుగా దేవీలాల్
Thovva web news.//13.Feb .Tue.

నరసింహుల పేట మండల కేంద్రము లోని శ్రీ వెంకటేశ్వరస్వామిదేవస్థానం వద్ద ప్రభుత్వ చీప్ విప్ స్థానిక ఎం ఎల్ ఎ డాక్టర్ రాంచంద్రు నాయక్ గారి ఆదేశాల మేరకు నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ అధ్యక్షులు దస్రు నాయక్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సంతు సద్గురు సేవాలాల్ మండల నూతన ఉత్సవ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అధ్యక్షులు గా పెద్దనాగారం స్టేజీ గ్రామ పంచాయతి శివారు హాజా తండాకు చెందిన భూక్యా దేవిలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గా కొమ్ములవంచ శివారు ఎర్ర శక్రు తండా కు చెందిన జాటోతు నాగేష్, బాదావతు వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా గుగులోతు రాజేందర్ కోశాధికారిగా భూక్యా రమేష్, ముఖ్య సలహా దారులుగా లావుడ్యా ఉదయ్, బానోత్ దస్రు, గుగులోత్ రమేష్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా గుగులోతు సిరి (వశ్రాం తండ ), బానోతు లక్ష్మణ్ ( బుడ్డ తండ), అజ్మీర వీరు (జగ్గు తండ), గుగులోతు రవి (లాలితండ), బానోత్ రమేష్ (ఎర్రకుంట తండ), గూగుల్ సురేష్ (దాసు తండ), నేతావత్ రవి (పకీర తండ), గుగులోతు వీరన్న (రూప్ల తండ), అజ్మీర జవహర్లాల్ (జగ్గు తండ), జాటోత్ సంతోష్ (దుబ్బ తండ), అజ్మీర రమేష్ (గోపతండ), మాలోత్ రాజేష్ (బొడ్డు తండ) మరియు బానోత్ సురేష్ (బస్తారాం తండ) మొదలగు వారిని ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం ఎస్టీ సెల్ అధ్యక్షులు దసరు నాయక్, మరియు నూతన అధ్యక్షులు దేవీలాల్ సేవాలాల్ ఆలయ పూజారి వెంకన్న తో కలిసి ఫిబ్రవరి 15వ తేదీన గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ సంతు సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వము గిరిజనులను గుర్తించి సెలవు దినముగా ప్రకటించినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకంచేశారు. అధ్యక్షులు దేవిలాల్ మాట్లాడుతూ సేవాలాల్ ఉత్సవ కమిటీ మండల నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ గుడి అన్ని విధాలుగా సహకరిస్తామని, అందరికీ అందుబాటులో ఉండి ప్రతి విషయంలో సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యామా తండాకు చెందిన గూగులోతు వీరు నాయక్, గుగులోతు అనిల్, గూగుల్ పాపా నాయక్, పకీర తండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ మొదలగువారితోపాటు సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు.