చనిపోయిన వారి పేరు తో పనిదినాల పైకం వసూల్….
14 విడత సామాజిక తనిఖీలో బట్టబయలు….
రూపాయలు 3,65, 633/- రికవరీ కి ఆదేశాలు
THOVVA WEB NEW//03.FEB. SAT


దేశంలో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకుండ ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే బృహత్ సంకల్పం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్వహించే బృహత్తర పథకం ఉపాధి హామీ ఈ పథకంలో అధికారుల నిర్లక్ష్యం తో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది ఇటీవల మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం జరిగిన 14.వ విడుత సామాజిక తనీకి ప్రజ వేదికలో పలు అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది వివరాల లోకి వెళితేనరసింహుల పేట మండలంలో 2022 -2023 సంవత్సరమునకు గాను జాతీయ ఉపాధి హామీ పథకం కింద నరసింహుల పేట మండలంలోని వివిధ గ్రామాలలో సామజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేపట్టి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నుంచి శనివారం వరకు ప్రజా వేదిక తనీకీ కార్యక్రమం నిర్వహించారు. తనిఖీ లో రూపాయలు 7 కోట్ల 84 లక్షల రూపాయలు ఖర్చు చేసి 871 పనులు చేయించడం జరిగిందని ఏపీడి శాంతి కుమారి తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పనుల్లో మాత్రంఅనేక రకాల అవకతవకలు జరిగినట్లు తనిఖీ బృందం వారు గుర్తించారు.చేసిన పనులలో మరణించిన వారి పేర్లను రికార్డ్ నుంచి తీసివేయాకుండ వారి పేరుతో పనిదినాలు చేసినట్టు పైకం మింగేశారు. చేసిన పనులలో అదనంగా పనిచేసినట్టు రికార్డులను నమోదు చేసుకొని అదనపు పేమెంట్లు ఇచ్చినట్టు సమాచారం. రోజ్ గారి యోజన దివస్ కార్యక్రమం పురస్కరించుకొని మండలంలో వివిధ గ్రామాలలో వర్షాకాలంలో ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పోశారని రికార్డ్ చేసుకుని పెమెంట్లు బిల్లులు తీసుకున్నారు. నాటిన తు మొక్కలలో సగం కు పైన మొక్కలు చనిపోయినట్లు లెక్కల్లో తేలిందనీ కూలీల సంతకాలు లేకుండానే బిల్లులు తీసుకున్నారని తనీకిలో తేలింది. సైన్ బోర్డు లు పెట్టకుండానే మెటీరియల్ ఛార్జ్ లు వసూలు చేశారు.జరిగిన అవకతవకలకు 22 గ్రామాలకు చెందిన ఫిల్డు అసిస్టెంట్ లకు, పంచాయతీ కార్యదర్శులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఈసీలకు, ఏ పీ ఒ, ఎంపీడీవో కి, జిపి రికవరీ మరియు మెట్లకు రూపాయలు 3,65, 633/- రికవరీ కి ఆదేశించారు.అజ్మీర తండా గ్రామపంచాయితీ రూ.9695/-
బక్క తండ రూ.16,588/-
బాసు తాండ రూ.7,651/-
బోడుక తండా రూ.37,938/-
బొజ్జన్నపేట రూ.16,817/-
గోపాతండా రూ.6,065/-
జగ్గు తండా రూ.9,139/-
జయపురం రూ.51,230/-
కొమ్ములవంచ రూ.33,513/-
కౌసల్యాదేవి పల్లి రూ.2,121/-
లోక్య తండా రూ.7,467/-
ముంగిమడుగు రూ.14,162/-
నరసింహపురం రూ.11,709/-
నర్సింహులపేట రూ.22,741/-
పడమటి గూడెం రూ.15,795/-
ఫఖీరతండ రూ.20,837/-
పెద్ద నాగారం రూ.8,100/-
పెద్ద నాగారం తండ రూ 4,076/-
రామన్న గూడెం రూ.4,282/-
రూప్లా తండ రూ.8,879/-
వంతడుపుల రూ.9,258/-
వశ్రామ్ తండ రూ.47,570/- కాగా వీటిలో ఫిల్డ్ అసిస్టెంట్ లకు రూ.2,818,
పంచాయితీ కార్యదర్శులకు రూ.1,19,619/-
కంప్యూటర్ ఆపరేటర్ లకు రూ.16,567/-
టెక్నీకల్ అసిస్టెంట్ లకు రూ.99,519/-
ఇ సి లకు రూ.55,913/-
ఏ పి ఒ కి రూ.9,732/-
యం పి డి ఒ కి రూ.11,966/-
గ్రామ పంచాయితీ రికవరీ రూ.48,599/-
మేట్స్ నుండి రూ.900/- మొత్తం రూ.3,65,633/-లు ఫైన్ లతో కలిపి రికవరికీ ఆదేశించారు. అంతే కాకుండా పని ప్రదేశం లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని, పని కావాలి అని అర్జీ పెట్టుకున్న ప్రతీ వారికి కూలీ పని దినాలు కల్పించాలని, పని ప్రదేశం లో ప్రమాదం జరిగితే వెంటనే స్పందించాలని హెచ్చరించారు. చనిపోయిన మొక్కల ప్లేస్ లో మొక్కలు నాటాలని చెప్పారు. అవకతవకాలకు పాల్పడితే సాహించేది లేదని చర్యలు తప్పవని ప్రజా వేదిక లో ఏ పి డి శాంత కుమారి అన్నారు. ప్రజా వేదిక కార్యక్రమం లో ఏ పి డి శాంత కుమారితో పాటు జిల్లా విజిలెన్స్ అధికారి యాఖుబ్, అంబుడ్స్ మెన్ ఆదాం, యం. పి. పి టేకుల సుశీల -యాదగిరి రెడ్డి, యం. పి. డి. ఒ భారతి, గత యం. పి. డి. ఒ సత్యనారాయణ రెడ్డి, యం. పి. ఒ సోమ్లాల్, యస్. ఆర్. పి నర్సయ్య, ఏ. పి. ఓ భూపాల్ రెడ్డి, తనిఖీ బృందం సభ్యులతో పాటు పంచాయితీ కార్యదర్శులు, ఫిల్డ్ అసిస్టెంట్ లు మరియు ఇ జి యస్ సిబ్బంది వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
