నూతన గ్రంథాలయం ప్రారంభించారు మళ్లీ తాళం వేశారు
ప్రజాప్రతినిధులు.పాఠకులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని అధికారులు?
మీరైనా పట్టించుకోవాలి అంటూ ఎమ్మెల్యే కు విజ్ఞప్తి
తొవ్వ న్యూస్.ఇన్ నర్సింహులపెట.
24.జనవరి గురువారం

గ్రంథాలయాలు విజ్ఞానానికి . ప్రతీకలు ఎంతోమంది మేధావులు విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి విజ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే ప్రతి చదువుకున్నవారు తమ సామయనుకులంగా గ్రంథాలయాలకి వెళ్లి విజ్ఞానం పెంపొందించుకోవాలని అనుకుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ లైబ్రెరీ లా పై ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. కానీ గ్రంథాలయాలు మూతపడుతుంటే మాత్రం అధికారులు ప్రజాప్రతినిధులు వాటిని తెరిపించేందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేయడంలేదు.జిల్లాలోని నర్సింహులపేట లో మండలంకేంద్రములో ఉన్న శాఖాగ్రంథాలయం గత నాలుగేళ్లుగా తలుపులు తెరచుకోలేదు. అధికారుల నిర్లక్ష్యంతో ముత పడి వుంది..సిబ్బంది కొరత, చూపుతూ సమస్యను దాట వేస్తున్నారు. గ్రంథాలయాయనికి తాళం పడుతున్న పాఠకుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. తాత్కాలిక సిబ్బందిని నియమించి గ్రంథాలయాలను పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నప్పటికీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. మండల కేంద్రంలో గ్రంథాలయం సుమారు నాలుగు సంవత్సరాలు మూతపడిన పట్టించుకోలేదు.ఇటీవల నెల రోజుల క్రితం ఆర్భాటంగా నూతన లైబ్రెరీ ప్రారంభించి కేవలం 3 రోజులు తీసి మళ్ళీ మూసివేశారు. ప్రస్తుతం గ్రంథాలయం మూతపడిన పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. లైబ్రెరీ నూతనంగా వచ్చిందనే సంతోషాన్ని కూడా మిగల్చకుండా పాఠకులకు మూడురోజుల మురిపెం చేశారు ఇటీవల
మండల కేంద్రంలో గ్రంధాలయం వెళ్లనుకునే పాఠకులకు నిరాశే మిగులుతుంది ఎప్పడూ వెళ్లిన తాళం వుండటం తో
వందల మంది విద్యార్థులు, పాఠకులకు గ్రంథాలయాలు దిన, వార, మాసపత్రికల తోపాటు నవలలు పాఠకులు, ఇతర విజ్ఞాన పుస్తకాలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా దుస్థితి
ని ప్రభుత్వం, గ్రంథాలయ సంస్థ నిర్లక్ష్యం కారణంగా కొత్త సిబ్బంది నియామకం చేపట్టకపోతుండడంతో ఇక గ్రంథాలయాలపై ఆశలు వదులుకోవలసిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి పాఠకులసమస్యలు వినాలని రెగ్యులర్ సిబ్బందినో, కాంట్రాక్టు సిబ్బందినో నియమించి మూతపడిన గ్రంథాలయాలను తెరిచే బాధ్యత ఎంతైనా ఉందనీ నూతన ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ను కోరుతున్నారు నర్సింహులపేట
మండల కేంద్రంలో గ్రంధాలయం మళ్లీ ప్రారంభించాలని పలు సంఘాల నాయకులు విద్యార్థులు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు..