
నర్సింహులపేట … మండలంలోని పెద్ద నాగారం స్టేజ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి స్థానిక గ్రామపంచాయతీ హజ్జా తండాకు చెందిన కాంగ్రెస్ మండల నాయకులు భూక్యా దేవి లాల్ భూక్యా హరిలాల్, 1,00,116/- (ఒక లక్ష 116 రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి విరాళం అందజేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం”శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి” ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి.. రూ. 1 లక్ష 116/- విరాళంగా అందజేసిన… మండల యువజన కాంగ్రెస్ నాయకులు భూక్యా దేవి లాల్ – భూక్యా హరిలాల్.లను సన్మానించారు
ఈకార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బిక్షం , రమేష్ లు ఉన్నారు.