కెమెరాల కిరాయితో కొత్త కెమెరాలు కొనవచ్చు….
జిల్లాలోని అధికారులు నాయ దందా….!
తొవ్వ న్యూస్.ఇన్//
వార్త సేకరణ:సుమన్. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
చారణకోడికి భారణ ఖర్చులా జిల్లాలో కొంత మంది అధికారులు ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. ప్రజలు కట్టే పనులతో వచ్చే ప్రభుత్వ ఆదాయంలో దుబారా ఖర్చులకు ఎక్కువ మొత్తంలో తగలేస్తున్నరు.జిల్లాలో ఎన్నికల వేళ పారదర్శకంగా చేయడం కోసం ఎన్నికల విధుల కోసం అవసరమైన కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక్కడికి బాగానే వున్న వాటికి కిరాయి లు తడిసి మోపెడు అవుతున్నాయ్.వీటికి అయ్యే కర్చు తో కొత్త కెమెరాలు కొనవచ్చు ..దేశంలో కామన్వెల్త్ క్రీడలు జరిగినపుడు సురేష్ కల్మడీ లాంటి నేతలు ఒక ప్లాస్టిక్ చైర్ కిరాయికి 1500/- కూలర్ రెంట్ 15000/- ఛార్జ్ చెయ్యడం లనే వుంది మన కార్యాలయంలో సిసి కెమెరాలు నిర్వాకం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సర్వీస్ కింద ముఖ్యమైన కార్యాలయాలకు సీసి కెమెరాలు కొని పెట్టాలని ఆదేశాలు వున్న అధికారులు కేవలం పర్సంటేజ్ ల కోసం కిరాయికి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఇదే కాకుండా ఎన్నికల్లో ఉపయోగించిన సీసీ వెహికల్స్ .డిజిటల్ స్క్రీన్ ఏర్పాట్లు లో లోపయేకరంగా అనుకున్న వి ఇచ్చిన వారికే కట్టబెట్టారని వార్త అయ కార్యాలయాల్లో చక్కర్లు కొడుతుంది అధికారుల తీరు తో జిల్లా ప్రజలు నవ్విపోతున్నారు!

