ప్రజల తీర్పు ను శిరసావహిస్తం …
కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు అండగా ఉంటాం …
మహబూబాబాద్ భూకబ్జాల పై ఎమ్మెల్సీ”తక్కెళ్లపల్లి” ఆరా ….!
తొవ్వ న్యూస్ .ఇన్.. 9398236146
దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి రైతులకు నేనున్నానని భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకొని అండగా వుంటానని , ముఖ్యమంత్రి పాలనా పై ప్రజల్లో వ్యతిరేకత లేదని కేవలం ఎమ్మెల్యే లాతీరు మాటల్లో కరుకు తనం , కార్యకర్తలను కాపాడుకోలేని నైజం అత్యుత్సహం తో సీనియర్లు ఐ లెక్క లేని తనముతోనే పార్టీ ఓటమి చవి చూడాల్సి వచ్చిందని గులాబీ జెండాకు ఓటములు కొత్త కాదని 10 ఏండ్లు ప్రభుత్వం నడిపిన తీరు తోనే ప్రతి పక్షంలోను ఉండి బిఅరెస్ ప్రారంభించిన పనులను పూర్తి చేసేలా పోరాడుతామని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు . సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల మావేశంలో మాట్లాడుతూకేసీఆర్ మాటను శిరసావహించి ప్రజల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఇచ్చి తీరాలన్నారు.ఉద్యమంలో పనిచేసిన తమ అనుచరులకు సరైన గుర్తింపు దక్కలేదని దక్కకుండా చేసినవారు ఎవరో తెలుసనీ పరోక్షంగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే పై సెటైర్లు విసిరారు , జిల్లా లో ప్రభుత్వ భూములు కబ్జాలకు అన్యాక్రాంతలకు గురైనట్టు వార్తలు వస్తున్నాయని వాటిపై కొత్త ప్రభుత్వం సరైన రీతిలో విచారణ చేయాలన్నారు . . భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండి ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానాన్నారు . . మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ కష్టపడి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిరవేర్చకపోయిన నా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బానోత్ రవి కుమార్ మంగళపల్లి కన్నా, జెర్రీ పోతుల వెంకన్న, ఎడ్ల వేణు, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.