తెలంగాణ ఉద్యమ నేతకు ఘన సన్మానం…

అమరుల ఆశయ సాధనలో ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 Thovva webnews మానుకోట, జూన్ 3:

 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రముఖ ఉద్యమ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరీద్ స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు.  మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బి ఆర్ ఎస్ శ్రేణులు ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు, ఉద్యమ సహచరులు, యువజన ప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉద్యమకారుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఉద్యమ నేత పరీద్ తన జీవితాన్ని తెలంగాణ సాధన కోసం అంకితం చేసి, మానుకోట ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను చైతన్యవంతం చేశారని కొనియాడారు.సన్మానానికి స్పందించిన ఉద్యమ నేత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమన్నారు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రేమాభిమానాలే తనకు పెద్ద పురస్కారమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *