ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి..




విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు డీఎస్పీ లు మృతి చెందారు. ఈ..షాకింగ్ సంఘటన తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద చోటు చేసుకుంది. ఈ..ప్రమాదంలో మృతి చెందిన వారు ఏపీకి చెందిన డీఎస్పీలుగా తెలుస్తుంది. వేగంగా వెళ్తున్న లారీ.. ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ..ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న డీఎస్పీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే కారుడ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీకి చెందిన పోలీస్అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ..ప్రమాదం చోటుచేసుకుంది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
