జాతరకుసిద్దమైన కొండలమ్మ దేవాలయం

ముస్తాబైన కొండలమ్మ దేవాలయం
-కాకతీయులు నిర్మించిన ఆలయాన్ని కాపాడండి
-దేవాదాయ శాఖ సహకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి
-పిన్నిరెడ్డి గూడెం గ్రామస్తులు లక్ష్మారెడ్డి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొవ్వ,గార్ల మార్చి25;

ఉగాది పర్వదినాన ప్రతీ ఏటా పిన్నిరెడ్డి గూడెంలో నిర్వహించే కొండలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్టు బీరవెల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. కాకతీయుల కాలంలో అలనాడు 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన కొండలమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచి నిత్య పూజలు అందుకుంటుందని అయన అన్నారు. ఆనాడు ప్రతాపరుద్రుడు కొండమ్మ, గారమ్మ, బయ్యమ్మలుగా దేవతలను కొలిచేవారని వారి పేర్లతో పిన్నిరెడ్డి గూడెంలో చెరువుకు కొండలమ్మ చెరువు అని ,సీతంపేట గ్రామంలోని పెద్ద చెరువుకు గార్ల చెరువు అని, బయ్యారం చెరువుగా పేర్లు పెట్టుకుని గంగదేవిని కొలిచేవారని దానినే ఆచారంగా ఆయా చెరువుల చుట్టూ ప్రక్కల ఉన్న రైతులందరూ ప్రతి ఏటా పండే పంటలో కొంత పంటతో ఆ దేవతలకు పరమాన్నం ప్రసాదించేవారని, అలాగే ప్రతీ ఏటా ఉగాది పర్వదినాన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డి గూడెం గ్రామంలో నాలుగు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పిన్నిరెడ్డి గూడెం గ్రామస్థులే కాక ఉమ్మడి జిల్లాల ప్రజలు,విదేశాల్లో స్థిరపడిన వారు కూడా కొండలమ్మ దీవెనలు అందుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తు ముమ్మరంగా జాతరలో పాల్గొంటున్నారన్నారు. ఐతే 12వ శతాబ్దంలో నిర్మంచిన కొండలమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరి రోజు రోజుకూ ఒక్కో రాయిగా అంతరిస్తూ ఆలయ రూపురేఖలు మారుతూ అంతరించి పోతుంటే గత 50ఏళ్లుగా గ్రామస్తులు కాపాడుతూ తలో ఇంత అన్న కోణంలో అభివృద్ధి చేస్తూ గుడిని కాపాడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లి కొండలమ్మ అని వారి నమ్మకం. ఆ ఊరిలో ఇంటికొకరికైనా కొండలమ్మ పేరుతో కలిసివచ్చేలా కొండల్, కొండలయ్య, కొండలమ్మా అని పేర్లు కూడా పెట్టుకుంటారని అన్నారు. పాడి పంటలు, పిల్లలు లేనివారికి సంతానం, ఆరోగ్య సమస్యలపై ఏది కోరునా తల్లి దివేనాలతో తప్పక కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ప్రతీ ఏటా అక్కడి ఆలయానికి రెండు నాగు పాములు వచ్చి ఆ నాలుగు రోజులపాటు అక్కడి ఆలయంలో దర్శనమిస్తూ వచ్చిన భక్తులను దివిస్తాయని మరుసటి రోజున ఆ నాగులు మాయమై మళ్ళీ మరుసటి సంవత్సరం దర్శనమిస్తాయని వారు తెలిపారు. ఐతే ప్రతి ఏటా జరిగిన విధంగా జాతర జరుపుతూ ఆలయాన్ని కాపాడుతుంటే ప్రతి ఏడాది 4రోజులు జరిగే జాతరకు 50వేలకు పైగా భక్తుల ఆదరణ ఉన్న ఆలయాన్ని దర్శించుకుంటున్న అమ్మవారి దేవాలయాన్ని దేవాదాయ శాఖ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై గ్రామ పెద్దలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి ఏటా ఆ సమయంలో ప్రభుత్వాన్ని పరిపాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు అమ్మవారి దీవెనలు తీసుకుంటున్నారే తప్ప దేవాలయ అభివృద్ధి గురించి ఆలోచించలేదని అన్నారు. ఏటా ఏటా భక్తులు పెరుగుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకునైనా ఆలయ అభివృద్ధి పై ఆలోచన జరపాలని కోరుతున్నారు. ఈ నెల28 ఎడ్ల బండ్ల ప్రభాలల ఊరేగింపు, 29న పూర్ణకుంభంతో దేవతారాధన, 30న నైవేద్యాల సమర్పణ, మహాజాతర, 31న సంకృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమలను భక్తులంతా అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటి సబ్యులు కోరారు. వారిలో ఆలయ కమిటీ చైర్మన్ బుర్లమల్లేషం, పుణెం వెంకన్న,పెంట్యాల శ్రీనివాసరావు, పి ఎల్లయ్య,పి రమణ,జలగం కొండయ్య, కె కొండల్ రావు,చింత ఎల్లయ్య,మోతీలాల్, ఎ రాజేష్,నరసింహ,నారాయణ రెడ్డి,అప్పి రెడ్డి,కమిటీ సభ్యులు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *