ఎవరు మిత్రులో శత్రువుల్లా తెలుసుకున్నా
అభివృద్ధి చేసి చూపించా అదరించలేదు….
కార్యకర్తలకు అండగా వుంట
పట్టణ విసృత స్థాయీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
తొవ్వ న్యూస్.ఇన్//9398236146..

ఓటమి గెలుపు నాంది అని. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులు తెలుసుకునే కనువిప్పు కలిగింది అని మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు శంకర్ నాయక్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి ప్రజలపై చూపిన సంక్షేమ బావుటా చరిత్రలో నిలిచిపోయేలా ఉందని కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్న అప్పులు కేవలం అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చుపెట్టి నవే అని అప్పులే కాదు ఆస్తులు కూడా వున్నాయని అవి చూడలేని గుడ్డి తనం ఆవరించిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే అది కేసీఆర్ గారి త్యాగం రాష్ట్ర ఏర్పాటు ద్వారానే వచ్చిందన్నారు.. ప్రజలు ఎందుకు ఓడించారు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు .తనపై కబ్జాల ఆరోపణలు చేస్తున్న నాయకులు ధైర్యం ఉంటే నిరూపించాలన్నారు జిల్లా సాధన నుంచి మొదలు కొని ప్రతి అభివృద్ధి వెనక తన మార్కుందని చెప్పారు ఒకప్పటి మహబూబాబాద్ నేడు మహబూబాబాద్ మార్పు . చూడాలన్నారు ప్రతి అభివృద్ధి తన తోటి సాధ్యమైందని అన్నారు. కబ్జా ఆరోపణల పై మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే స్థలం సేకరించడం జరిగిందని దాన్ని తీసుకుననే క్రమంలో నేను ముందు పడడం వల్లనే నా పేరు పై కబ్జారోపణలు వచ్చాయని దీనిలో ఎటువంటి వాస్తవం లేదనీ సమాధానం చెప్పారుప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉండాలని వారికి సంక్షేమ పలాలు ప్రభుత్వ హామీలు అమలు పట్ల నిరంతరం పర్యవేక్షణ చేయాలని ప్రజల పక్షాన ఉంటు భవిష్యత్ కార్యాచరణ చేయాలని, నేను ఎప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా అందుబాటులో ఉంటానని మహబూబాబాద్ నియోజకవర్గంలోనే ఉంటా అని ప్రతి కార్యకర్త ఎల్ల వేళలా తనను కలవవచ్చని అన్నారు.ఈ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ ఫరీద్. పట్టణ అధ్యక్షులు గద్దె రవి సీనియర్ రాష్ట్ర నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి. మార్నేని వెంకన్న గోగుల రాజు ముత్యం వెంకన్న వార్డ్ కౌన్సిలర్ల పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు


