డోర్నకల్ సెగ్మేట్ లో ” రామసాయం “రాజకీయ చతురత ..
కాంగ్రెస్ గెలుపుకు వర్గ పోరును ఛేదిస్తూ గ్రామా గ్రామాన తన మార్కు ….
కాంగ్రెస్ పార్టీ లో తన మార్కు చూపిస్తున్న ఆర్ ఎస్ ఆర్ …
డోర్నకల్ నియోజకవర్గ “తొవ్వ” ముఖ చిత్రం
రాజకీయ విశ్లేషకులు : ముకేశ్ వీరంటి 9398236146
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆనాటి రాజకీయాల నుంచి నేటి రాజకీయాల వరకు అయన పేరు తెలియనివారువుండరు ఆయనే ఆర్ ఎస్ ఆర్ ఉమ్మడి జిల్లాలో ప్రముఖంగా అయన రాజకీయ శిష్యుల్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పినవారే అయన అనుచరులు మంత్రులు ఏఐసీసీ నేతలుగా ఎదిగారు . డోర్నకల్ లో తన వారసుడిగా ఒక గిరిజన నేతను ఎంపిక చేసి సమితి అధ్యక్షున్ని నుంచి ఏకంగా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించి ప్రత్యక్షముగా పరోక్షంగా మద్దతు ఇస్తూ నిలిచాడు . నాడు జరిగిన రాజకీయ రణ క్షేత్రంలో గురువును అనుకోని సమయంలో వదిలి పెట్టి తనే ఎంతో మందికి గాడ్ ఫాదర్ లా నిలిచి రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువును కాదని ఆయననా గురువు కాదుఅని నాకు వేరే నాయకుడి ప్రోద్బలంతోనే రాజకీయంగా ఎదిగానని చెప్పుకోవడం తో ఆ గురు శిష్యుల అనుబంధం బంధం తెగిపోయింది. అది కాస్త నేడు సమరానికి కాలుదువ్వింది. నాటి గురువు ఆర్ సురేందర్ రెడ్డిఅయితే అయన ప్రియతమా శిష్యుడు రెడ్యా నాయక్ ప్రసుతం డోర్నకల్ రాజకీయాల్లో బలాబలాలు తేల్చుకొని ఎవరి సత్తా ఎంత ఉందొ నిరూపించుకోవడానికి గురు శిస్యులు ఇరువురు నేతలు తమ శాయ శక్తుల కృషి చేస్తున్నారు . ఆర్ ఎస్ ఆర్ తన రాజకీయ తంత్రం నేర్పుతో రిజర్వ్ గా వున్నా డోర్నకల్ లోమరో ఏకలవ్య శిష్యుడిగా భావించి రామచందర్ నాయక్ టికెట్ ఇప్పించి మరి మద్దతు పలికారు . ఆర్ధిక అనుసంధాన కర్తగా తన బంధువు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి డోర్నకల్ లో సెగ్మెంట్ ను అలెర్ట్ చేసి అప్పగించారు . అంతేకాకుండా ఏవిధంగా నైనా రెడ్యా ను ఓడించి తన సత్తా చాటాఆయన అనుచరులకు గాలం వేశారు . డోర్నకల్ గత ఎన్నికల్లో వర్గ బేధాలు చూపిన గులాబీ పార్టీ నేతలు సత్యవతి రాథోడ్ అటు నూకల నరేష్ రెడ్డి , తాళ్లూరి బాబు లాంటి నాయకుల అనుచరగణం రెడ్యా కు మద్దతు ఇవ్వకుండా రాజకీయ తంత్రం నేర్పుతున్నారు . దీనితో డోర్నకల్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి దీనికి తోడు కాంగ్రెస్ లో వర్గ విభేదాలతో ఎక్కడ సీటు చేజారుతుందోనని తన రాజకీయ చతురత తో అటు భూపాల్ నాయక్ ను ఇటు మాలోత్ నెహ్రు లను కాంగ్రెస్ రెబల్ నాయకులను బరిలో లేకుండా చేశారు. భూపాల్ నాయక్ నామినేషన్ తిరస్కరణలో భూపాల్ అనుచరులు ఆర్ ఎస్ ఆర్ అనుచరులతో మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం . ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ లో కురవి మండలంలో బల మైన నేతగా ఎదిగిన మాలోత్ నెహ్రు ను అయన బంధువు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ను ఒప్పించి కాంగ్రెస్ బరిలోనుంచి తప్పుకొనేలా చేయడంలో ఆర్ ఎస్ ఆర్ పాత్ర కీలకం గా 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ గెలవాల్సి వున్నా నాడు ఆర్ధికంగా బలంగా కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడం తో నేటి ఎన్నికలో అలాంటి పరిస్థితి రాకుండా అన్నిరంగాల్లో ఢీకొట్టేవిధంగా వ్యవస్థను నిర్మాణం చేశారు .
ఆర్ ఎస్ ఆర్ రాజకీయ తంత్రంలో రెడ్యా బలం తగ్గేనా… ?
డోర్నకల్ అంటే రెడ్యా నాయక్ అని రెడ్యా నాయక్ అంటే డోర్నకల్ అనే నానుడిని ఈ ఎన్నికలు ఎవరికీ పట్టం కడుతాయో వేచి చూడాలి ముఖ్యంగా రెడ్యా నాయక్ రాజకీయ జీవితంలో ఈవె చివరి ఎన్నికలు అని అయన ప్రకటించడం తోనాయకులు కలిసి కట్టుగా గెలిపించడానికి విశ్వా ప్రయత్నం చేస్తున్నారు . 6 నెలల ముందునుంచే తిరుగుతున్న రెడ్యా నాయక్ గ్రామాల్లో కొంత వ్యతిరేకత వున్నా దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతం చెందారు కానీ రాజకీయ గురువు ఆర్ ఎస్ ఆర్ రంగ ప్రవేశం చేసిన తరవాత కొంత గ్రాఫ్ తగ్గుతున్నట్టు తెలుస్తుంది ఆయననుచర గణంలోని చాల మంది చాటు మాటుగా ఆర్ ఎస్ ఆర్ టచ్ లోకి వెళ్లినట్టు విశ్వాసనీయ సమాచారం సత్యవతి వర్గం నాయకులు నరేష్ రెడ్డి వర్గం నాయకులూ అంతర్గతంగా కాంగ్రెస్ కు పనిచేస్తారని గ్రామాల్లో ప్రజలు చర్చింకుంటున్నారు , ఆలా అని రెడ్యా కు బలమైన నాయకత్వం క్యాడర్ లేక పోలేదు అయన బలం నవీన్ రావు సత్యనారాయణ రెడ్డి రంగారెడ్డి లాంటి గ్రామానికి ఒక నాయకుడు వున్నారు నాయకులూ తమ రాజకీయ చతురత తో గెలిపించాలని ప్రయతినిస్తున్నారు దీనికి తోడు మానుకోట నియోజకవర్గ సీనియర్ నాయకులూ అయన కోసం పనిచేస్తున్నరు అన్నింటిని మించిన కూతురు జిల్లా బిఅరెస్ అధ్యక్షురాలు కవిత తన తన తండ్రి గెలుపు కోసం విశ్వా ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైన ఈ సరి డోర్నకల్ ఎన్నికల్లో సరి కొత్త రాజకీయ యుద్ధ వాతావరణం సంతరించుకుంది డిసెంబర్ 3 న ప్రకటించే ఫలితాల్లో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో వేచి చూడక తప్పదు


