మన బిడ్డలకు ఇలాగే పెడతామా..!
మీకు అసలు మానవత్వం ఉందా..! ఈ.. రాష్ట్రప్రభుత్వానికి అసలు మతి ఉందా..!!
విద్యార్థులు చచ్చిపోతున్నా..! అనారోగ్యంతో చిక్కిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపేలేదా…!!
రాష్ట్రాన్ని ఏలుతున్నది రాక్షసులేమో అనే అనుమానం కలుగుతోంది…!!!
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…
తొవ్వ, ప్రతినిధి ఆగస్ట్ 02;

మాడినఅన్నం…!గొడ్డుకారం..!!ఇదే పిల్లలకి పెట్టె ఆహారం మన పిల్లలకు ఇలానే పెడతామా సాక్షాత్తు జిల్లాకలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉండే మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోనే పరిస్థితి ఇంత దారుణా తిదారుణంగా ఉంటే..!! జిల్లా అంతట పరిస్థితి మరెలా ఉంటుందో ఆలోచించడానికే భయం వేస్తోందని మాజీమంత్రి సత్యవతిరాథోడ్…అన్నారు శనివార మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించి పరిస్థితులను చూసి చలించి పోయారు.విద్యార్ధినుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి మాటాడుతూ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకోవడం, డప్పులు కొట్టించుకోవడం కాదు.!! విద్యార్థుల తిప్పల్లు తీర్చండి…మహబూబాబాద్ గురుకుల పిల్లలకు కారం తో బ్రేక్ ఫాస్ట్ పెట్టడం ఏంటని..?, మాడిపోయిన, ముద్దల అన్నం తినలేక ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని సిబ్బంది ని నిల దీశారు గత ప్రభుత్వంలో కేసీఆర్ 284 గా ఉన్న గురుకులాలను 1,023 గురుకులాలకు పెంచిండు, 1,60,000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారు. మరి మీరు చేస్తున్నదేమిటి గత ప్రభుత్వం ఆనవాళ్లు మారుస్తా అంటే..!! ఆనవాళ్లు మార్చడం అంటే హాయిగా ఉన్న విద్యార్థులను ఆకలితో చంపడమో.., అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరేలా చేయడమో.., లేదంటే టీసీలు తీసుకుని వాళ్ళు పారిపోయేలా పరిస్థితులను దిగజార్చడమో ఇదేనా మీరు సాధించిన మార్పు అంటూ మండిపడ్డరు మాజీమంత్రి సత్యవతిరాథోడ్..,ఇక్కడ పరిస్థితి మారాలి, పరిశుభ్రత పెరగాలి, పౌష్టికాహారం పెట్టాలి.., చక్కని విద్యాబోధన జరగాలి.., మీ.. వెకిలి చేష్టలతో, అసమర్థ పనితీరుతో విద్యార్థులు ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకోం అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

