ఇందిరమ్మ ఇండ్లకు మొదటి బిల్లు వచ్చింది,
శర వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,
గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దొంగల జనార్దన్ రెడ్డి, జక్కుల నాగన్న,

తొవ్వ న్యూస్ ప్రతినిధి కురవి జూలై 31,
ఇందిరమ్మ ఇండ్ల బిల్లు రావడంతో లబ్ధిదారులు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించినట్లు గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దొంగల జనార్దన్ రెడ్డి, జక్కుల నాగన్న తెలిపారు, గురువారం మండలంలోని అయ్యగారి పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు లక్ష రూపాయలు వారి అకౌంట్లో జమ కాగానే గ్రామంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసినట్లు పేర్కొన్నారు. డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కృషితో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకుంటున్నారని వారికి జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు అన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ డోర్నకల్ ఎమ్మెల్యే కృషితోటే నేడు గ్రామంలో 21 ఇండ్లు నిర్మాణం జరుగుతుందని కొన్ని ఇండ్లకు మొదటి విడత బిల్లు లక్ష రూపాయలు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే కృషితో రెండో విడత ఇండ్లు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాలు జరుపుకుంటున్నారు మీకు బిల్లులు వస్తాయా అని ఎద్దేవా చేసినవారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇండ్లు నిర్మించుకునే వారిని అంటారు అని కార్యదర్శి నాగన్న అన్నారు. సబ్జా లెవల్ కాగానే మరో బిల్లు వస్తుందని తెలిపారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు, ఇండ్లు తీసుకొచ్చి గ్రామ ప్రజలకు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వేమిశెట్టి ప్రసాద్. నాయకులు గజ్జి అనిల్ యాదవ్. చిట్టపు రెడ్డి రామ్ రెడ్డి. బజ్జూరి చైతన్య రెడ్డి. బుడిగ రమేష్. శ్రీపాద పూర్ణాచారి. బుడిగ రవీందర్. కడారు వీరన్న. లచ్చినారి. కడారు రవి. తోడుసు మల్సూరు. బుర్ర బిక్షపతి. బొల్లు సాయి. బొల్లు వేణు. బుడేగ సుభాష్. బల్లం వినోద్. ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.