మాజీ సర్పంచ్, బొమ్మెరఎల్ల గౌడ్
ఎంపీ నిధులు5 లక్షల తో చేపట్టే పనులను ప్రారంభించిన నేతలు
తొవ్వ, నెల్లికుదురు, జూలై 28

గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి తన స్వంత నిధులు 5 లక్షల రూపాయలు కేటాయించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు తాము రుణపడి ఉండడంతో పాటు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మాజీ సర్పంచ్ బొమ్మెర ఎల్ల గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని ఎర్రబెల్లి గూడెంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన సొంత నిధుల నుంచి సిసి రోడ్డు నిర్మాణానికి కేటాయించిన ఐదు లక్షల నిధులతో చేపట్టే పనులకు మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బత్తిని అనిల్ గౌడ్, తో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా తన శక్తి వంచన లేకుండా పేద ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు అందిస్తున్న ఏకైక నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అని కొనియాడారు. గతంలో గ్రామంలో ఏ కుల దేవతల గుడులు నిర్మాణం చేసిన తన శక్తి వంచన లేకుండా ఆర్థిక సహాయ సహకారాలు అందించారని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఐకమత్యంగా కలసి చేసుకోవాలని హితవు పలికారు. గ్రామ అభివృద్ధి కోసం త్వరలోనే మరో 15 లక్షలు నిధులు అందిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొజ్జా నాయక్, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు జీలకర. యాకయ్య, గౌడ సంఘం గ్రామ అధ్యక్షులు పల్లె వెంకట్రా ములు గౌడ్, వివిధ పార్టీల నేతలు గాదె గంగా మదర్, అశోక్, సముద్రాల వెంకన్న, గజ్జి ఐలయ్య, తరాల వెంకన్న, గుండెబోయిన వీరభద్రం, వంగాల ఈశ్వర్, మోటపోతుల ఉప్పలయ్య, రవి, గొల్లపల్లి సోమయ్య గౌడ్, యాకయ్య గౌడ్, బూరుగు యాకయ్య గౌడ్, శ్రీశైలం, శ్రీరాముల ఉప్పలయ్య తదితరులున్నారు.
