ఉన్నత ఉద్యోగాన్ని వదిలి వర్మీ కంపోస్ట్ వ్యాపారం…
నేడు రసాయన ఎరువులు లేకుండా ఆధునిక సాగు
గ్రోయింగ్ ట్రీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ తొ రైతులకు మేలు



Thovva web news. In;
అయన ఒక ఉన్నత ఉద్యోగిగా కార్పొరేషన్ కంపెనీ లో పనిచేసేవాడు. డెయిరీ పరిశ్రమ మీద ఆసక్తితో ఉద్యోగం లో సంపాదించిందంతా డైయిరీ ఫామ్ లోనే
పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తూ నష్టాల పాలయ్యాడు. అయినా నిరాశ చెందలేదు. ఆవు పేడతో వెర్మీ కంపోస్ట్ వ్యాపారాన్ని స్టార్ చేశాడు. చిన్న రైతులకు సేంద్రియ సాగువైపు మళ్లేందుకు సాయం చేస్తూ, తానూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.వివరలోకి వెళితే
ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్కు చెందిన
38 ఏళ్ల రాజ్ సింగ్, 2008లో ఆటోమోటివ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ డిగ్రీ, పూర్తి చేసి 2014లో మార్కెటింగ్ లో ఎంబీఏ పూర్తి చేశారు. దాదాపు ఒక దశాబ్దం పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన రాజ్.. ఒత్తిడి, రొటీన్ లైఫ్తో విసిగెత్తిపోయి 2017లో ఏడు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని 40 ఆవులతో డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొద్ది రోజుల్లోనే తన వ్యాపారాన్ని 250 ఆవులతో పాలవ్యాపారం జోరుగా సాగించాడు, సేంద్రియ ఎరువుల వ్యాపారం వైపు రాజ్ సింగ్వ స్తరించించాడు. అంతా సాఫీగా సాగుతున్నసమయంలో కొవిడ్ మహమ్మారి కుదిపే సింది. డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ లేక ఒక్క నెలకే రూ. 60 లక్షల నష్టం వచ్చింది.సంక్షోభం నుంచి స్టార్టప్డెయిరీ బిజినెస్ లాస్ స్టార్టవడంతో పునరాలోచనలో పడ్డాడు రాజ్ సింగ్. నిండా మునగకముందే తేరుకోవాలని డెయిరీ వ్యాపారాన్ని మూసేశాడు. ఆవు పేడను వృథా కాకుండా ఉపయోగించాలనే ఆలోచ నతో వెర్మీకంపోస్ట్ గా మార్చే వ్యాపారం స్టార్ట్ చేశాడు. దీనివల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా, ‘గ్రోయింగ్ ట్రీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే స్టార్టపు ఏర్పాటుచేశాడు. ఎకరానికి 6 క్వింటాళ్లు. చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ ఎరు వులను సులభంగా ఉపయోగించగలిగేలా కిలో రూ. 3 నుంచి రూ.4.50 వరకు విక్రయిస్తున్నాడు. రాజ్ వెర్మీకంపోస్ట్లో కూరగా యల నాణ్యత గణనీయంగా పెరిగింది. ఎక రానికి 6-7 క్వింటాళ్ల వెర్మీకంపోస్ట్ను ఉప యోగిస్తూ మంచి దిగుబడిని సాధించారు. నర్సరీలు, కూరగాయల తోటలు, పాలీహౌస్లకు దీనిని విస్తరించాడు.
రూ.2.5 కోట్ల వార్షికాదాయం
ఖరీదైన ప్లాస్టిక్ షీట్లు, ఇటుకలు, కాంక్రీట్ బెడ్లకు బదులుగా, అరటి ఆకులను మల్చింగ్కు ఉపయోగించాడు రాజ్. సాధా రణంగా వెర్మీకంపోస్ట్ను 30 రోజుల్లో విక్ర యిస్తారు. కానీ రాజ్ 90 రోజుల పాటు పూర్తి కుళ్లిపోయే వరకు అలాగే ఉంచుతాడు. ఇది ఉత్పత్తి నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. 500 కంపోస్ట్ బెడ్లను ద్వారా ప్రతి నెలా 500 టన్నుల వర్మీకం పోస్టు ఉత్పత్తి చేస్తూ రూ. 2.5 కోట్ల వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు