బహుజనులకు శుభ దినం
బారాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యసం రమేష్
తొవ్వ. నెల్లికుదురు. జూన్ 20;

జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆ శోద భాస్కర్ జన్మదినం బహుజనులకు శుభదినము అని బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యసం రమేష్ అన్నారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ప్రజా సంఘాలు మాల మహానాడు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్, ప్రచార కార్యదర్శి చెదలయా కాంతం లతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అదేవిధంగా మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో మాల జర్నలిస్టు అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బొడ్డు అశోక్ కేక్ కట్ చేసి నిరుపేదలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో పలు సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు మాలల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి భాస్కర్ అని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో ప్రజా ప్రతినిధిగా రాణించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి యువ సైన్యం మండల అధ్యక్షులు బాణాల సంజీవ, ముదిరాజ్ మహాసభ మండల నాయకులు నారబోయిన మల్లయ్య, నైనాల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆవుల సాయి మల్లు, ప్రజా సంఘాల నేతలు తదితరులున్నారు.