తొవ్వ, ప్రతినిధి. ఫిబ్రవరి 28;
చల్లగా బీర్ వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ కు అనుసందనంగా నిర్వహించే పూసపల్లి లోని ఓ బెల్ట్ షాపులో యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అక్కడే స్నేహితులతో కూర్చొని తాగడానికి మూత తీసి ఒక గ్లాస్ పోసుకోగానే బాటిల్ లో ఏదో తేడాగా కనిపించింది. నిశితంగా పరిశీలించగా ఆ బీర్ బాటిల్ లో చెత్త తో పాటు పాకురు కనిపించింది. ఇదేమిటనీ ఆ షాపు యజమాని అడుగగా నాకు తెలియదు నేను జిల్లా కేంద్రంలోని వైన్స్ లో తెచ్చాను అని కాల్ ఆ వైన్స్ యజమాని కి ఫోన్ చేయగా అయన నాకు సంబంధం లేదు ఏమి చేయలేను అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. తాగలేక డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన బీర్ ను అక్కడే వదిలేసి ఉసురు మంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
